Plane stucked: ఆకాశంలో ఆగిపోయిన విమానం.. గాల్లో తేలుతూ కనిపించిన వింత విమానం.. వైరల్‌ వీడియో

Plane stucked: ఆకాశంలో ఆగిపోయిన విమానం.. గాల్లో తేలుతూ కనిపించిన వింత విమానం.. వైరల్‌ వీడియో

Anil kumar poka

|

Updated on: Aug 30, 2022 | 9:53 AM

గాల్లో దూసుకుపోతున్న విమానం ఒక్కసారిగా ఆకాశంలో ఆగిపోతే ఏమవుతుంది? కుప్పకూలిపోయి.. పెను ప్రమాదానికి దారితీస్తుంది కదా... కానీ ఓ విమానం ఆకాశంలో ఆగిపోయింది...


గాల్లో దూసుకుపోతున్న విమానం ఒక్కసారిగా ఆకాశంలో ఆగిపోతే ఏమవుతుంది? కుప్పకూలిపోయి.. పెను ప్రమాదానికి దారితీస్తుంది కదా… కానీ ఓ విమానం ఆకాశంలో ఆగిపోయింది. గాల్లో తేలుతూ ఉన్న ఆ విమానం కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గాలిలో స్ట్రక్‌ అయిపోయి, తేలుతున్న ఈ విమానం కింద కారులో వెళ్తున్న వ్యక్తి కంటపడింది. వెంటనే అతను ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. తాను కారులో ముందుకు క‌దులుతున్నాన‌ని, కానీ, విమానం ఆకాశంలో అక్కడే ఉండిపోయింద‌ని వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తెలిపాడు. మరో సోషల్‌ మీడియా సంస్థ షేర్‌ చేసిన మరో వీడియోలో కదులుతున్న కారులో కూర్చున్న వ్యక్తి వ్యతిరేక దిశలో వెళ్తున్న విమానాన్ని బంధించాడు. ఆ విమానం ఏ మాత్రం కదలడం లేదు. డల్లాస్/ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇలాంటి వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ వీడియో 2018లో యూట్యూబ్‌లో క‌నిపించింది. అయితే, దీని వెనుక సైన్స్ దాగి ఉంద‌ని నిపుణులు తెలిపారు. వాస్తవానికి ఆకాశంలో చిక్కుకున్నట్టు కనిపించే విమానాలు ‘ఆప్టికల్ ఇల్యూజ‌న్’ అని చెప్పారు. ‘విమానాలు తరచూ ఎదురుగాలి, టెయిల్ విండ్ గుండా వెళ్తాయి. ఒక టెయిల్‌విండ్ విమానం దిశలో వీస్తున్నప్పుడు, విమానం కదిలే దిశకు వ్యతిరేకంగా ఎదురుగాలి వీస్తుంది. చాలా బలమైన ఈదురు గాలుల కారణంగా విమానాలు గాల్లోనే ఆగిపోయిన‌ట్టు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి చాలా చాలా నెమ్మదిగా కదులుతాయని వివ‌రించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..

Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!