రచ్చ లేపిన కండోమ్ యాడ్ !! అసలు విషయం తెలిస్తే షాక్ !!

|

Aug 19, 2022 | 9:20 AM

దేశ రాజధానిలో తాజాగా ఓ ప్రకటన రచ్చ లేపింది. ఢిల్లీ మెట్రో రైల్‌ లోని ప్రయాణీకులు కూర్చునే సీట్లపై ఓ కండోమ్ సంస్థకు చెందిన యాడ్ లు కనిపించాయి.

దేశ రాజధానిలో తాజాగా ఓ ప్రకటన రచ్చ లేపింది. ఢిల్లీ మెట్రో రైల్‌ లోని ప్రయాణీకులు కూర్చునే సీట్లపై ఓ కండోమ్ సంస్థకు చెందిన యాడ్ లు కనిపించాయి. అది కూడా మెట్రో రైలులో మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వు చేయబడిన సీట్ల వద్ద కండోమ్ యాడ్ లు వెలుగుచూడటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా మెట్రో రైల్‌లో కండోమ్ యాడ్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో నెటిజన్లు ఢిల్లీ మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మెట్రో లో కండోమ్ యాడ్ కు సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది. ఈ ఫోటో చూసిన మరికొంతమంది డిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్- DMRC ని ట్యాగ్ చేసి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఢిల్లీ మెట్రో.. మీరు పురోగతి చెందారా.. మహిళల సీట్ల వద్ద కండోమ్ యాడ్ పెట్టారా.. మీ తప్పేమీ లేదు. కానీ మీకు ఓ విషయం తెలియాలి. భారత్ ఎటువంటి దేశమంటే.. టీవీలో మధ్యాహ్నం సమయంలో కండోమ్ యాడ్స్ రావొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఒకసారి దృష్టిసారించండి అంటూ పోస్టు చేశాడు. మరికొంతమంది అయితే ఇందులో పెద్ద తప్పేమీ కనిపించడంలేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులు స్పందించారు. ఆ యాడ్ చాలా కాలం నాటిదని.. ఇప్పుడు అక్కడ లేదని.. ఎప్పుడో తొలగించామని సమాధానమిచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంలో చేపల కోసం వల వేస్తే ఊహించనిది చిక్కింది !!

ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే

కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!

Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది

అయ్యోరామ్‌ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!

 

 

Published on: Aug 19, 2022 09:20 AM