దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
వేగంగా కదులుతున్న రైల్లోంచి ప్రముఖ నటి ఒకరు దూకేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగింది. రాగిణి ఎంఎంఎస్, ‘ప్యార్ కా పంచనామా 2’లతో అలరించిన నటి కరిష్మా శర్మ ప్రమాదానికి గురయ్యారు. ముంబై లోకల్ ట్రైన్లో ప్రయానిస్తున్న ఆమె ఒక్కసారిగా రైల్లోంచి దూకేసింది. ఆమె వీపు, తలకు గాయాలయ్యాయని ఆమె స్నేహితులు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి ఆమె చీర ధరించి లోకల్ ట్రైన్‌లో బయల్దేరారు. తాను రైలు ఎక్కగానే వేగంగా కదిలిపోయిందని, తన స్నేహితులు రైలు ఎక్కలేకపోయారని దాంతో తనకు భయంవేసి వెంటనే రైల్లోనుంచి దూకేసానని కరిష్మా తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. వెనక్కి తిరిగిపడడంతో వీపు, తలకు బాగా దెబ్బలు తగిలాయని తన పోస్టులో రాసుకొచ్చారు. శరీరమంతా కూడా చిన్న చిన్న గాయాలైనట్లు కరిష్మా తెలిపారు. తలకు దెబ్బ తగలడంతో డాక్టర్లు ఎంఆర్‌ఐ చేశారని.. ప్రస్తుతం తనను ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచారని, తాను ధైర్యంగా ఉన్నానని తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు. అయితే, ప్రమాదం జరిగినప్పుడు కరిష్మాను చూసి తాను షాక్ అయినట్లు ఆమె స్నేహితురాలు తెలిపారు. ‘‘దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె రైలులో నుంచి పడిపోయింది. మేం వెళ్లి చూసేసరికి తనకు ఏమీ గుర్తులేదు. వెంటనే ఆసుపత్రికి తరలించాం’’ అని ఆమె స్నేహితురాలు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. పలు సినిమాలు, ధారా వాహికలతో పాటు కరిష్మా రియాలిటీ షోలలోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షోల్లో అలరించారు.
మరిన్ని వీడియోల కోసం :
ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
