Acting to be Dead: ఏంటి బ్రో ఇది.. ? రూ.1కోటి కోసం..ఇంత డ్రామానా..? నవ్వులు పూయిస్తున్న వీడియో..
కోటి రూపాయల బీమా కోసం తాను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. కానీ, పాపం ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దేవాస్‌కు చెందిన హనీఫ్ 2019, సెప్టెంబర్‌లో ఓ కంపెనీ నుంచి కోటి రూపాయల బీమా కవర్ తీసుకున్నాడు.
కోటి రూపాయల బీమా కోసం తాను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. కానీ, పాపం ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దేవాస్‌కు చెందిన హనీఫ్ 2019, సెప్టెంబర్‌లో ఓ కంపెనీ నుంచి కోటి రూపాయల బీమా కవర్ తీసుకున్నాడు. రెండు వాయిదాలు కట్టిన తర్వాత.. డాక్టర్. షకీర్ మన్సూరి అనే వైద్యుడి సాయంతో.. హనీఫ్ మృతిచెందినట్లుగా నకిలీ మరణపత్రాన్ని రూపొందించారు. హనీఫ్ మరణపత్రంతో అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ ఆ కోటి రూపాయల బీమా క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు పెట్టారు.
ఇదే వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన సదరు కంపెనీ.. దేవాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో హనీఫ్ సజీవంగానే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నవంబర్ 7న ఫోర్జరీ కేసులో భాగంగా.. హనీఫ్, అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్‌తోపాటు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించిన వైద్యుడు షకీర్ మన్సూరిని అరెస్ట్ చేశారు..ఇక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని, అతడి డిగ్రీ పట్టాపైన విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…