Araku Coffee: అరకు కాఫీలో అంత మజా ఉందా..? G-20 సమావేశాల గిఫ్ట్ ప్యాక్ లో స్థానం..
అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ.. గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించారు.
అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ.. గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించారు. అలాగే జీ-20 దేశాధినేతలకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లలో కూడా అరకు కాఫీకి చోటు దక్కింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అద్భుతమైన అటవీ ప్రాంతం మన్యం, ఏజెన్సీ లో అరుదైన కాపీ సాగు జరుగుతోంది. పాడేరు, అరకు లాంటి ఎత్తైన కొండల మధ్య ఉన్న వ్యాలీల్లో అత్యంత అరుదైన కొండ జాతి సంప్రదాయ గిరిజన కుటుంబాలు కాఫీ సాగు చేస్తున్నారు. ఈ వ్యాలీ పరిసర ప్రాంతాలలో కాఫీ తోటకు అనుకూలంగా ఉండడం, అక్కడ పండే కాఫీ పంట నుంచి తీసే కాఫీ అద్భుతమైన రంగు, రుచి వాసన ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఒకసారి ఈ కాఫీ తాగిన వాళ్ళు మళ్లీ ఆ కాఫీ కోసమే అరకు ప్రాంతాలకు వస్తుండడంతో ఇక్కడ పండుతున్న కాఫీకి ప్రపంచ స్థాయి పేరొచ్చింది. విశాఖ మన్యం లో సాధారణంగా పోడు వ్యవసాయం ఎక్కువ. దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంట సాగుకు అనుమతి ఇచ్చి ప్రోత్సహించింది. దాంతో గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో గిరిజన సహకార సంస్థ కృషి ఎంతో ఉంది. ఇది మొదట సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం మొదలయ్యింది. క్రమేపీ అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలా ప్రారంభమైన కాఫీ తోటలు ఇప్పుడు లక్షన్నర ఎకరాల వరకు విస్తరించడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..