Woman – ex-lover: మాజీ లవర్ కోసం మంత్రగాడిని ఆశ్రయించిన యువతి.. కట్ చేస్తే దిమ్మ తిరిగే షాక్..!
చైనాకు చెందిన ఓ అమ్మాయికి ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. దాంతో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అయితే, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో
చైనాకు చెందిన ఓ అమ్మాయికి ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. దాంతో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అయితే, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇక లాభం లేదనుకుని ఓ మంత్రగాడిని ఆశ్రయించింది. తన బాధను అతనికి చెప్పుకుంది. తనను, తన ప్రియుడిని ఎలాగైనా కలపాలని వేడుకుంది. అయితే, అమ్మాయి అమాయకత్వాన్ని గ్రహించిన ఆ మాయలోడు.. అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయిని తన ప్రియుడితో కలుపుతానంటూ.. ఇందుకోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని, కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుందని చెప్పాడు. ప్రియుడికంటే తనకు ఎక్కువ మరేదీ లేదనుకున్న ఆ అమ్మాయి.. మాయలోడు చెప్పిన అన్నింటికీ ఓకే చెప్పేసింది.తన పన్నాగం పారిందని గ్రహించిన మంత్రగాడు అమ్మాయిని రహస్యంగా ఒక ప్రదేశానికి రమ్మని సూచించాడు. కొన్ని వస్తువులు తీసుకురమ్మని ఓ లిస్ట్ రాసిచ్చి, కొంత డబ్బు కూడా తెమ్మని చెప్పాడు. అతను చెప్పినట్లుగా వస్తువులన్నీ తీసుకొచ్చింది. వస్తువులతోపాటు లక్షా 50 వేల డబ్బుకూడా ఇచ్చింది. ఇంకేముంది.. తనకు కావాల్సినది వచ్చేసింది. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తూ.. డబ్బులు తీసుకుంటూ.. ఉన్నట్లుండి ఓరోజు కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం అమ్మాయి ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి.. విషయాన్ని తన స్నేహితులకు చెప్పుకుని బావురుమంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

