B-Tech Chaivali: బీటెక్‌ చదివితే జాబే చెయ్యాలా? నా రూటే సెపరేటు అంటున్న అమ్మాయి.!(వీడియో)

Updated on: Oct 20, 2022 | 10:00 AM

జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి మరోసారి రుజువుచేసింది.


బీటెక్‌ చదువుకున్న ఈ అమ్మాయి వ్యాపార రంగంవైపు అడుగులేస్తూ.. తన కలను సాకారం చేసుకుంది. బీటెక్‌ చాయ్‌వాలి పేరుతో ఓ టీ షాప్‌ ఓపెన్‌ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్‌ హర్యానాలో తన బీటెక్‌ పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు తన చదువుతో సబంధమే లేకుండా.. ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ వద్ద ‘బీటెక్‌ చాయ్‌వాలీ’ పేరుతో టీ షాపును ప్రారంభించింది. ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతుంది. ‘బీటెక్‌ చాయ్‌వాలీ’తో తాను ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బీటెక్‌ చాయ్‌వాలి. మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ‘బీటెక్‌ చాయ్‌వాలీ’ ఎంతో ఫేమస్‌ అయిపోయింది. ఈ షాప్‌లో స్పెషల్‌ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు క్యూకడుతున్నారు. కాగా, బీటెక్‌ చాయ్‌వాలీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.