woman dance on cycle: వామ్మో ఏందమ్మా ఇదీ.. చంపేశావ్‌గా.. నాట్యం చేస్తూ సైకిల్‌పై దూసుకెళ్తోన్న యువతి..
సైకిల్ హ్యాండిల్ కూడా పట్టుకోలేదు.. అలా భరతనాట్యం చేస్తూ తలపైన కుండనే కాదు సైకిల్‌ను కూడా ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్లిపోతోంది.
సహజంగా కళలు 64 అని చెబుతుంటారు పెద్దలు. కానీ ఇటీవల ఈ కళలను రీ మిక్స్ చేసి వాటి సంఖ్యను పెంచేస్తున్నారు కొందరు ట్యాలెంటెడ్ పర్సన్స్. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఈ వీడియో చూసాక దీనిని 65వ కళ అంటారో.. ఇంకేదైనా పేరు పెడతారో మీ ఇష్టం. ఈ వీడియోలో ఓ యువతి రోడ్డుపైన సైకిల్ తొక్కుతూ దూసుకెళ్లిపోతోంది. ఇందులో వింతేముంది అనుకోకండి. ఆ అమ్మాయి చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించి చూడ్డానికి అచ్చం గోపికలా ఉంది. తలపైన కుండ పెట్టుకుని కృష్ణుడికి వెన్న తీసుకెళ్తున్న రాధలా ఎంతో ఆనందంగా సైకిల్‌పైనే నృత్యం చేస్తూ దూసుకుపోతోంది. సైకిల్ హ్యాండిల్ కూడా పట్టుకోలేదు.. అలా భరతనాట్యం చేస్తూ తలపైన కుండనే కాదు సైకిల్‌ను కూడా ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్లిపోతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు యువతి ట్యాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. అద్భుతం అంటూకామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
