Viral Video: దువ్వాడ స్టేషన్ సీన్ రిపీట్.. రైలుకి-ప్లాట్‌ఫారంకి మధ్యలో పడిన యువకుడు.. కానీ..?
ఇటీవల దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు దిగుతూ ఓ విద్యార్ధిని రైలుకి, ప్లాట్‌ఫారంకి మధ్య ఇరుక్కుపోయింది. రెస్క్యూ సిబ్బంది దాదాపు గంటన్నరపాటు
ముంబైలోని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ మీద రైలు బయల్దేరడానికి రెడీగా ఉంది. ఇంతలో ఓ యువకుడు వాటర్ బాటిల్ తెచ్చుకుందామని ట్రైన్ దిగి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లాడు. ఇంతలో రైలు కదిలిపోయింది. అది గమనించిన యువకుడు పరుగుపరుగున రైలువద్దకు వచ్చాడు. కానీ ఇంతలోనే రైలు వేగం పెరిగింది. ఈ క్రమంలో సదరు యువకుడు ఒక చేతిలో పానీయాలు పట్టుకుని రైలు రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతే కాలు జారి అతడు ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అధికారి, కొందరు ప్రయాణికులు యువకుడ్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై యువకుడివద్దకు పరుగెత్తారు. విషయం తెలుసుకున్న లోకోపైలెట్ ట్రైన్‌ను నిలిపివేశాడు. దాంతో రైల్వేపోలీసు అధికారి, ఇతర ప్రయాణికులు కొంతసమయం శ్రమించి.. యువకిడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రైలు ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, సమయం లేనప్పుడు రైలు దిగే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos