Dhoni Bike: బైక్ స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడిన ధోనీ..సైకిల్‌లా ముందుకి నెట్టుకెళ్లిన ధోనీ.. వీడియో వైరల్..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండరు. అయితే, ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లో
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండరు. అయితే, ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ధోనీకి సంబంధించిన ఏవైనా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంటారు. ఈ క్రమంలో ధోనీకి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ధోనికి మోటార్ బైక్స్ అంటే చాలా ఇష్టం. అతని వద్ద ఎన్నో రకాల మోటార్ బైకులు ఉన్నాయి. ధోనీ బైక్ నడుపుతూ తన బైక్‌ను స్వయంగా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఫొటోల్లో మనం చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ధోనీ బైక్ స్టార్ట్ చేయడానికి కిక్ చేస్తూ.. కష్టపడుతున్నారు. కానీ, అది స్టార్ట్ కాలేదు. అలా చాలాసేపే తంటాలు పడితేకానీ బైక్ స్టార్ట్ కాలేదు. మైదానంలో అవలీలగా సిక్స్‌లు బాదే నాకే చుక్కలు చూపిస్తావా కూల్… అంటూ.. చివరికి కొంతదూరం నెట్టుకెళ్లాక స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూల్.. మిస్టర్ కూల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos