Crime: సెల్‌ఫోన్ ఇలా కూడా ప్రాణం తీస్తుంది..! దొంగల దుర్మార్గానికి యువ సాఫ్ట్‌వేర్ బలి.
తొలి ఏకాదశి పర్వదినాన ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటే.. ఈ ఇంట్లో మాత్రం తీరని శోకం మిగిలింది. సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నం యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిండు ప్రాణం బలైంది. రైలు మార్గంలో దోపిడీ దొంగల దుర్మార్గానికి యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలే పోయాయి.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన రాములు -ధనమ్మల కుమారుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుదినం కావడంతో ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి తొలిఏకాదశి పూజల్లో పాల్గొనేందుకు వస్తున్నాడు. శాతవాహన రైల్ లో సికింద్రాబాద్ నుండి కాజిపేటకు బయలుదేరాడు. అయితే బీబీనగర్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన కర్రలతో కాపుకాసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించారు. ఫుట్ బోర్డ్ వద్ద నిలబడి ఉన్న శ్రీకాంత్ చేతిలోని సెల్ ఫోన్ ను కర్రతో కొట్టి లూటీ చేసేందుకు ప్రయత్నించారు. తన సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పండుగకు ఇంటికి వస్తున్నానన్న కొడుకు రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు మరణవార్త తెలిసి బోరున విలపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...