Viral Video: 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి కక్కుర్తి పడింది.. చివరకు అడ్డంగా దొరికిపోయింది.

Viral Video: 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి కక్కుర్తి పడింది.. చివరకు అడ్డంగా దొరికిపోయింది.

Anil kumar poka

|

Updated on: Jun 24, 2023 | 7:38 PM

ఫ్రీ అంటే చాలు జనం అక్కడ వాలిపోతారు. జనాల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పలువురు ఫ్రీ పేరుతో బోల్తా కొట్టిస్తారు. అయితే పంజాబ్ పోలీసులు ఈ ఫ్రీ పథకాన్నే అమలు చేసి 8 కోట్లు కొట్టేసిన నిందితులను పట్టుకున్నారు. 8 కోట్లు కొట్టేసి ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోవడం విడ్డూరం కదూ.

ఫ్రీ అంటే చాలు జనం అక్కడ వాలిపోతారు. జనాల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పలువురు ఫ్రీ పేరుతో బోల్తా కొట్టిస్తారు. అయితే పంజాబ్ పోలీసులు ఈ ఫ్రీ పథకాన్నే అమలు చేసి 8 కోట్లు కొట్టేసిన నిందితులను పట్టుకున్నారు. 8 కోట్లు కొట్టేసి ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోవడం విడ్డూరం కదూ. లుథియానాలో రూ.8 కోట్ల 49 లక్షలు చోరీకి పాల్పడిన మాస్టర్‌మైండ్‌ మన్‌దీప్‌ కౌర్‌ ను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ తర్వాత ఆమె ఉత్తరాఖండ్‌ చమేలీలో గల హేమకుండ్‌ సాహిబ్‌కు మొక్కుతీర్చుకునేందుకు భర్తతో పాటు వెళ్లింది. ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఫ్రీ ఫ్రూటీ సర్వీస్ పేరుతో పథకం వేయగా.. ఆమె ఫ్రూటీ తాగేందుకు వచ్చి భర్తతోపాటు పోలీసులకు దొరికిపోయింది. ఐ ఈ ఘటనలొ ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 కోట్ల 96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. “మన్‌దీప్‌ కౌర్‌ దంపతులు నేపాల్‌ మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ చేయడంతో వారు వెళ్లలేకపోయారు. ఉత్తరఖాండ్ లో ప్లాన్ ప్రకారం మన్ దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్ తో పాటు మరో నిందితుడు గౌరవ్ను అరెస్ట్ చేశాం. వారి నుంచి 21లక్షలు స్వాధీనం చేసుకున్నాం” అని సీపీ మన్దీప్ సింగ్ సిద్దూ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!