Viral: గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో..

Viral: గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 29, 2024 | 3:28 PM

ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసింది ఓ మహిళ. రైలు వచ్చేస్తోందనే కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో ట్రైన్ ఆమె పై నుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు..

ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసింది ఓ మహిళ. రైలు వచ్చేస్తోందనే కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో ట్రైన్ ఆమె పై నుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలివైపు ఉన్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండడం చూసి హడావుడిగా దాటుతున్నారు. ఓ మహిళ పట్టాలు దాటగా.. మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో పడిపోయింది. దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన కదలకుండా ఉండిపోయింది. మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా.. కెమెరాలో అదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి హెచ్చరించడంతో ఆమె అలెర్ట్ అయ్యి.. తల ఎత్తకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ప్రాణాలను కాపాడుకోగలిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.