Viral Video: గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..

|

Jul 01, 2024 | 11:17 AM

నెదర్లాండ్‌కు చెందిన ఓ మహిళా పైలట్‌కు భయానక అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఎగురుతుండగా ఒక్కసారిగా పైకప్పు తెరుచుకుంది. ఈ ఊహించని పరిణామానికి షాకైన ఆమె ఆందోళనచెందకుండా సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. నరైన్‌ మెల్కుమ్జాన్‌ అనే మహిళా పైలట్‌కు ఈ భాయనక అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.

నెదర్లాండ్‌కు చెందిన ఓ మహిళా పైలట్‌కు భయానక అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఎగురుతుండగా ఒక్కసారిగా పైకప్పు తెరుచుకుంది. ఈ ఊహించని పరిణామానికి షాకైన ఆమె ఆందోళనచెందకుండా సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. నరైన్‌ మెల్కుమ్జాన్‌ అనే మహిళా పైలట్‌కు ఈ భాయనక అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది తన రెండో ప్రయాణమని, తాను నడుపుతోన్న ‘ఎక్స్‌ట్రా 330ఎల్‌ఎక్స్‌’ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరచుకుందని, టేకాఫ్‌కు ముందు సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లడం కూడా తాను చేసిన మరో తప్పు అని తెలిపారు.

ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడంతో తన పరిస్థితి మరింత దిగజారిందని, ఒకవైపు విమానం భారీ శబ్దం.. మరోవైపు సరిగ్గా చూడలేని, శ్వాస తీసుకోలేని దుస్థితి. ఆ సమయంలోనూ దాన్ని నడిపించడం అత్యంత సవాల్‌గా మారిందన్నారు. కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 28 గంటలు పట్టింది. అవి నా జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు అంటూ రెండేళ్ల క్రితం నాటి తన అనుభవాన్ని కళ్లకు కట్టారు. ఇదంతా చాలా ఆలస్యంగా వెల్లడించానని, అయితే.. పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి. మీరు చాలా ధైర్యవంతురాలని ఒకరు స్పందించారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారంటూ మరొకరు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.