Peanut: ఒక్క వేరుశనగ పప్పు.. మహిళ ప్రాణం మీదకు తెచ్చింది..

|

Sep 29, 2023 | 7:07 PM

ఒక్కోసారి చిన్న చిన్న సంఘటనలే ప్రాణాలమీదకు తెస్తాయి. ఊహించని విధంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఇటీవల గొంతులో ఆహార పదార్ధాలు ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఒక్కోసారి చిన్న చిన్న సంఘటనలే ప్రాణాలమీదకు తెస్తాయి. ఊహించని విధంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఇటీవల గొంతులో ఆహార పదార్ధాలు ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ నెట్టింట వైరల్‌ అవుతోంది. చిన్న వేరుశనగ పలుకు ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. కొండాపూర్‌కు చెందిన విజయలక్మి అనే మహిళకు వేయించిన వేరుశెనగ పలుకులు రోజూ తినడం అలవాటు. అలా ఒక రోజు ఓ పక్కకు ఒరిగి తినడంతో ఒక పలుకు పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుంది. అది రానురాను తీవ్ర ప్రభావం చూపింది. దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలతో ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు పడింది. వైద్యులను సంప్రదించగా న్యూమోనియాగా భావించి మందులు ఇచ్చారు. అయినా సమస్య పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. దాంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్పెషలిస్ట్‌ను సంప్రదించారు. ఆయన మహిళకు సీటీ స్కాన్‌ చేసి శ్వాసనాళాలు, ఊపిరితిత్తులకు మధ్య ఏదో ఇరుక్కుని న్యూమోనియాకు దారి తీసినట్లు తేల్చారు. వెంటనే బ్రాంకోస్కోపీతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దాన్ని బయటకు తీశారు. తీరా చూస్తే అది వేరుశనగ పలుకు. చిన్న పప్పుబద్ద ఇంత ప్రమాదానికి దారితీసిందా అని ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..