Crime: బాలికపై అత్యాచారం.. సాయం కోసం అర్ధించినా స్పందించని జనం..

Crime: బాలికపై అత్యాచారం.. సాయం కోసం అర్ధించినా స్పందించని జనం..

Anil kumar poka

|

Updated on: Sep 29, 2023 | 7:14 PM

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ పన్నెండేళ్ల బాలికపై మానవత్వం మరిచి పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. సాయం చేయమంటూ బాలిక ఎందరినో వేడుకున్నా.. ఏ ఒక్కరూ కనికరించలేదని తెలుస్తోంది. ఓ వ్యక్తి అయితే సాయం కోరుతున్న బాలికను తరిమి కొట్టినట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ పన్నెండేళ్ల బాలికపై మానవత్వం మరిచి పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. సాయం చేయమంటూ బాలిక ఎందరినో వేడుకున్నా.. ఏ ఒక్కరూ కనికరించలేదని తెలుస్తోంది. ఓ వ్యక్తి అయితే సాయం కోరుతున్న బాలికను తరిమి కొట్టినట్టు తెలుస్తోంది. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చివరికి ఓ ఆశ్రమం ఆ చిన్నారిని ఆదుకుంది. ఆమెను చూసి టవల్ కప్పి ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బాద్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆమెను తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆ బాలికను ఇండోర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడున్న పోలీసులు రక్తదానానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్యపరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయింది. నిందితుల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ ఘటనకు సంబంధించి ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని కోరినట్టు ఉజ్జయిని పోలీస్‌ చీఫ్ సచిన్‌ శర్మ తెలిపారు. బాధితురాలు మాట్లాడుతున్న యాస ప్రకారం.. ఆమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ అని భావిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..