Viral Video: ఈమె 22 ఏళ్లుగా చికెన్ మాత్రమే తింటుంది.. ఎందుకో తెలుసా..! తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)
కొందరు వ్యక్తుల అలవాట్లు విచిత్రంగా ఉంటాయి... వారి ఆహార అలవాట్లు, జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ని కామెంట్ చేస్తాడు గుర్తుందా..."ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు" అని అది సినిమాలో సరదాకి అన్న డైలాగే అయినా...
కొందరు వ్యక్తుల అలవాట్లు విచిత్రంగా ఉంటాయి… వారి ఆహార అలవాట్లు, జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ని కామెంట్ చేస్తాడు గుర్తుందా…”ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు” అని అది సినిమాలో సరదాకి అన్న డైలాగే అయినా… ఇక్కడ ఓ యువతి అది నిజం చేసింది. కాకపోతే ఈమె తినేది ఉప్మా కాదండోయ్… చికెన్.. గత 22 ఏళ్ల నుంచి ఈమె కేవలం చికెన్ మాత్రమే తింటుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. తన రోజువారి డైట్‌లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయట. పండ్లు, కూరగాయలు అస్సలు పడవట. బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల ఓ యువతి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. అసలు తను పండ్లు, కూరగాయలు తిన్న జ్ఞాపకమే లేదంటోంది. వాటిని తినాలని కూడా ఆమెకు లేదట. వాటిని తింటే.. తనకు ఏదోలా అవుతుందట. తనకు మూడేళ్ల వయసునుంచే పండ్లకు, కూరగాయలకూ దూరంగా ఉంటూ వచ్చిందట. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటుందట ఈ అమ్మాయి. ఉదయం లేవగానే తను అందరిలా బ్రేక్‌ఫాస్ట్ చేయదట… మధ్యాహ్నానికి లంచ్ మాత్రం పొటాటో చిప్స్ తింటుందట. రాత్రి డిన్నర్‌లో 8 చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై మాత్రమే తింటుందట. ఇదండీ… ఈమె చికెన్ కథ.. దీనిపై ఏంటో ఈ వింత అలవాట్లు… అంటున్నారు నెటిజన్లు… నిజమేకదండీ..!
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..