Inspirational Story: నమ్మి వచ్చిన భర్త నట్టేట ముంచాడు.. లోకం తెలియని పసివాడితో రోడ్డున పడేశాడు.. ఆ బాధతోనే బ్రతుకుబండిని లాగుతూ..

జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసి మూడు ముళ్లు వేసిన భర్త ప్రమాణాలు గాలికొదిలేసి.. కుటుంబాన్ని రోడ్డున పడేసి మధ్యలోనే మడమ తిప్పాడు. దాంతో లోకం

Inspirational Story: నమ్మి వచ్చిన భర్త నట్టేట ముంచాడు.. లోకం తెలియని పసివాడితో రోడ్డున పడేశాడు.. ఆ బాధతోనే బ్రతుకుబండిని లాగుతూ..

|

Updated on: Oct 02, 2022 | 9:59 AM


జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసి మూడు ముళ్లు వేసిన భర్త ప్రమాణాలు గాలికొదిలేసి.. కుటుంబాన్ని రోడ్డున పడేసి మధ్యలోనే మడమ తిప్పాడు. దాంతో లోకం తెలియని పసివాడితో ఒంటరిగా రోధించని ఆ అబల సబలగా మారింది. జీవిత సత్యాన్ని గ్రహించింది. తనకు తాను ధైర్యం చెప్పుకుంది. వృద్ధురాలైన తల్లి, మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఆ మహిళ వారికి భారం కాకూడదు అనుకుంది. ఒంటరి పోరాటం మొదలు పెట్టింది. లోకం, సమాజం ఇవన్నీ పక్కన పెట్టింది. తనకు చేతనైన పనితోనే తన బిడ్డను పోషించుకోవాలనుకుంది. వెంటనే ఓ రిక్షా అద్దెకు తీసుకుంది. గాజియా బాద్‌కు చెందిన చంచల శర్మ తన చిన్నారి బాబును చున్నీతో కట్టి గుండెలపై బిడ్డను మోస్తూ.. రిక్షాలో ప్రయాణికులను లాక్కెళ్తూ.. తన బ్రతుకు బండిని కొనసాగిస్తుంది. ఉదయం ఆరున్నర గంటలకల్లా సెక్టార్‌-62 లోని మెట్రో ఎలక్ట్రానిక్‌ సిటీకి వస్తుంది. అక్కడ రోజుకు 300రూపాయలకి ఆటో రిక్షాను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఇలా రోజుకు 600 నుంచి 700 వరకూ సంపాదిస్తోంది. నిజాయితీగా చేసే ఏపనీ తక్కువ కాదంటూ నిండైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us