YouTuber: రోడ్డుపై మ‌ద్యం తాగిన యూట్యూబ‌ర్.. అరెస్టుకు వారెంట్‌ జారీ.. ఇతనెవరో తెలుసా..?

|

Aug 25, 2022 | 9:59 AM

ఇటీవ‌ల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ సిగ‌రేట్ తాగి ఇంట‌ర్నెట్‌లో ఫేమస్‌ అయిన యూట్యూబర్ బాబీ క‌టారియా అరెస్టుకు ఉత్త‌రాఖండ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో..


ఇటీవ‌ల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ సిగ‌రేట్ తాగి ఇంట‌ర్నెట్‌లో ఫేమస్‌ అయిన యూట్యూబర్ బాబీ క‌టారియా అరెస్టుకు ఉత్త‌రాఖండ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబ‌ర్ క‌టారియా మ‌ద్యం సేవించాడు. పోలీసుల్ని బెదిరించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో అత‌నిపై కేసు న‌మోదు అయింది. ఐపీసీలోని 342, 336, 290, 510 సెక్ష‌న్ల కింద కేసును బుక్ చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేష‌న్‌లో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు. యూట్యూబ‌ర్ క‌టారియాను అరెస్టు చేసేందుకు హ‌ర్యానాకు పోలీసుల్ని పంపిన‌ట్లు ఓ ఆఫీస‌ర్ తెలిపారు.ఫిబ్ర‌వ‌రిలో అత‌న్ని నో ఫ్ల‌యింగ్ జాబితాలో చేర్చారు. ఆ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ అదో డ‌మ్మీ విమానం అని, దుబాయ్‌లో షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ వీడియో తీసిన‌ట్లు బాబీ క‌టారియా తెలిపాడు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 25, 2022 09:59 AM