Nalgonda: ట్రాక్టర్‌తో వ్యక్తిని తొక్కించే యత్నం.. అయిన వాల్లే ఇలా చేస్తే ఎలా..? ఎందుకంటే.. వీడియో వైరల్..

|

Jan 22, 2023 | 9:20 AM

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్లలో భూ వివాదం తారాస్థాయికి చేరింది. ట్రాక్టర్‌తో తొక్కించి, ఓ వ్యక్తిని చంపాలని ప్రయత్నించాడు ఓ రైతు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

మునుకుంట్లలో ఇద్దరు వ్యక్తుల మధ్య కొంతకాలం నుంచి ల్యాండ్ విషయమై వివాదం కొనసాగుతుంది. దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని గ్రామస్థులు సూచించినా.. ఆ ఇద్దరు వెనక్కు తగ్గలేదు. ‘నువ్వా-నేనా’ అనేలా గొడవ పడుతూ వస్తున్నారు. తాజాగా ఈ వివాదం ముదిరిపాకాన పడింది. విజయ్ సుధాకర్ తన పొలాన్ని ట్రాక్టర్‌తో చదును చేస్తున్న సమయంలో రవీందర్ అడ్డుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందేనంటూ.. రవీందర్‌ను ట్రాక్టర్‌తో తొక్కించేందుకు విజయ్ ప్రయత్నించాడు.అయితే.. ట్రాక్టర్ ముందు భాగాన్ని పట్టుకొని రవీందర్ బతికి బయటపడ్డాడు. అప్పటికీ ట్రాక్టర్‌ను ఆపకుండా.. విజయ్ నడుపుతూనే ఉన్నాడు. ట్రాక్టర్ కిందకు వస్తే, రవీందర్‌ను తొక్కించేయాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న వ్యక్తులు ట్రాక్టర్ ఆపాల్సిందిగా అరుస్తున్నా.. విజయ్ ఆపకుండా అలానే నడిపాడు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on