Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లి వెంట్రుకలు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కు..ఇదో పిల్లి పంచాయితీ!వీడియో

పిల్లి వెంట్రుకలు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కు..ఇదో పిల్లి పంచాయితీ!వీడియో

Samatha J

|

Updated on: Feb 13, 2025 | 6:49 PM

నల్గొండలో రెండు కుటుంబాల మధ్య విచిత్రమైన గొడవ తలెత్తింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరింది. ఈ చిత్రమైన గొడవను పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు గొడవ గురించి తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకుంటారు. నల్లగొండ పట్టణం మీర్ బాగ్ కాలనీకి చెందిన పుష్పలతకు పిల్లులు అంటే ఎంతో ఇష్టం. ఏడాది క్రితం నెల వయసున్న మిల్క్‌ వైట్‌ కలర్‌ పిల్లిని తెచ్చుకొని షఫీ అని పేరు పెట్టుకొని పెంచుకుంటుంది. అయితే గత ఏడాది జూన్‌లో ఆ పిల్లి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పుష్పలత కుటుంబం పిల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయినా దాని జాడ కనిపించలేదు.

ఇటీవల వారి పక్కింట్లో అదే పోలికలతో ఉన్న బ్రౌన్‌ కలర్‌ పిల్లి కనిపించింది. ఆ పిల్లిని చూసిన పుష్పలత కుటుంబం, ఆ పిల్లి తమదేనని భావించారు. ఇటీవల తన ఇంటి పరిసరాల్లో పిల్లి కనిపించడంతో పట్టుకొని పుష్పలత ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ ఇంటి పక్కనే ఉండే అష్రాఫ్‌, ఆ పిల్లి తమదని..తమకు ఆరు పిల్లులు ఉన్నాయని, అందులో ఇదొకటని వాదించారు. తాము పెంచుకుంటున్న పిల్లిని ఎలా తీసుకెళతారని ప్రశ్నించాడు. అయితే.. పిల్లి తనదేనని.. గుర్తు పట్టకుండా రంగులేశారని పుష్పలత ఆరోపించింది. తన పిల్లి ఎలా ఉంటుందో తనకు తెలుసుననీ పిల్లిని ఎత్తుకెళ్లి రంగు వేసి మోసం చేస్తారా, దానికి స్నానం చేయిస్తే ఆ రంగంతా పోయిందని పుష్పలత చెబుతున్నారు. జనవరి 15న టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పుష్పలత కేసు నమోదు చేసింది. ఈ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు పుష్పలత ఫిర్యాదు చేసింది. పిల్లి పంచాయితీ తేల్చాలంటూ జిల్లా ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ పిల్లిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పుష్పలత, అష్రాఫ్‌ లను స్టేషన్‌కు పిలిపించారు. ఎంతకీ పంచాయితీ తెగకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. పిల్లి పంచాయితీ తెగకపోవడంతో అసలు యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. పిల్లి యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పిల్లి వెంట్రుకలను పశు వైద్యాధికారి ద్వారా సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. రెండు మూడు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక రానుంది. ఈ నివేదికతో అసలు పిల్లి అసలు యజమాని ఎవరో తేలిపోనుంది

మరిన్ని వీడియోల కోసం :

రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో

తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్‌..ఏం చేశారంటే..! వీడియో

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్‌ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!