Viral: డబ్బులు రావడంలేదని పక్క వ్యక్తికి ఏటీఎం కార్డ్‌ ఇచ్చిన మహిళా.. అంతే!

|

Nov 19, 2023 | 8:47 AM

ఏటీఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. దాంతో ఎంత దూరం వెళ్లినా క్యాష్‌ క్యారీ చేయక్కర్లేకుండా కార్డు వెంటపెట్టుకొని వెళ్తే సరిపోయేది. దీనిని అధిగమిస్తూ డిజిటల్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక కార్డుతో కూడా పనిలేకుండా పోయింది. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది కొంత ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే ఏటీఎంలో కార్డుద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం తెలియనివారు ఇతరులపై ఆధారపడుతున్నారు.

ఏటీఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. దాంతో ఎంత దూరం వెళ్లినా క్యాష్‌ క్యారీ చేయక్కర్లేకుండా కార్డు వెంటపెట్టుకొని వెళ్తే సరిపోయేది. దీనిని అధిగమిస్తూ డిజిటల్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక కార్డుతో కూడా పనిలేకుండా పోయింది. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది కొంత ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే ఏటీఎంలో కార్డుద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం తెలియనివారు ఇతరులపై ఆధారపడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సాయం చేసినట్టే చేసి, తర్వాత వారి ఎకౌంట్స్‌లోనుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రాచేయడానికి వెళ్లింది. మెషిన్‌లో కార్డు పెట్టింది కానీ డబ్బులు రాకపోవడంతో పక్కనున్న వ్యక్తిని చూడమని కార్డ్‌ అతనికి ఇచ్చింది. అదే ఆమె కొంపముంచింది.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో ఆంధ్రా ప్రగతి గ్రామీణ ప్రగతి బ్యాంక్(APGPB) ఏటీఎంలో మునీంద్ర అనే మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లింది. అక్కడ డబ్బులు రాకపోవడంతో అక్కడికి వచ్చిన మరో వ్యక్తిని డ్రా చేసి పెట్టమని కార్డ్‌ ఇచ్చింది. అతను రెండు మూడుసార్లు కార్డ్‌ మెషిన్‌లో పెట్టి, ఆమెను పిన్‌ ఎంటర్‌ చేయమని చెప్పాడు. ఆమె పిన్‌ ఎంటర్‌ చేసినా డబ్బులు రాలేదు. ఈ క్రమంలో మధ్య మధ్యలో ఆ మహిళ ఫోన్‌ చూస్తోంది. ఇదే అదనుగా ఆ గుర్తు తెలియని వ్యక్తి మహిళ ఏటీఎం కార్డును మార్చి తన ఏటీఎం కార్డును మెషిన్‌లో పెట్టాడు. మహిళ పిన్‌ నంబర్ కొట్టింది. మనీ రాలేదు. దాంతో అతను మెషిన్‌ పనిచేయడంలేదని ఆమెతో చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అనంతరం మహిళ కార్డును ఉపయోగించి ఆమె ఖాతానుంచి 25 వేల రూపాయలు డ్రాచేసుకొని వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలో మహిళను మోసం చేసి.. కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.