Samosa: ఇష్టంగా సమోసాలు లాగించేస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.. తస్మాత్ జాగ్రత్త.
సమోసాలంటే ఇష్టం లేని వారంటూ బహుశా ఎవరు ఉండకపోవచ్చు! సాయంత్రం అయిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు పక్కన వేడి వేడి సమోసాలు లాగించేస్తుంటారు. వ్యాపారులు కూడా కస్ట్‌మర్స్‌ను ఆకట్టుకునేందుకు రకరకాల సమోసాలు చేస్తుంటారు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు ప్రజల్ని నోరూరిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన సమోసా ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
సమోసాలంటే ఇష్టం లేని వారంటూ బహుశా ఎవరు ఉండకపోవచ్చు! సాయంత్రం అయిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు పక్కన వేడి వేడి సమోసాలు లాగించేస్తుంటారు. వ్యాపారులు కూడా కస్ట్‌మర్స్‌ను ఆకట్టుకునేందుకు రకరకాల సమోసాలు చేస్తుంటారు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు ప్రజల్ని నోరూరిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన సమోసా ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. యూపీలోని హాపూర్‌లో ఒక దుకాణం నుండి సమోసాలు కొన్న వ్యక్తి.. వాటిని తింటుండగా రుచిలో ఏదో తేడా కొట్టి సమోసాను పరిశీలించాడు. ఇంకేముంది.. అందులో బల్లిని చూసి షాకయ్యాడు. ఆలూ సమోసాలు బల్లి కనిపించడంతో తీవ్ర ఆందోళన చెందాడు.
పండగ సందర్భంగా ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం సమోసాలు కొన్నాడు. ఎంతో రుచికరంగా ఉండే సమోసాలు కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంటిల్లిపాది ఆ సమోసాలను తిన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అతను కూడా సమోసా తింటుండగా రుచిలో ఏదో తేడా అనిపించి చూశాడు. దాంతో సమోసా లోపల బంగాళదుంపకు బదులుగా బల్లి కనిపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అతడు వాంతులు చేసుకున్నాడు. సమోసాలు తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఓచిన్నారి కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. వెంటనే బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ వార్త స్థానికంగా దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొద్దిసేపటికే ఆ వ్యక్తి ఇంటి బయట జనం గుమిగూడారు. దీంతో బాధిత కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో చాలా మంది సమోసా ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తుందంటూ కామెంట్ చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.