Viral: పొలంలో కనిపించిన వింత వస్తువు.. భయాందోళనలో ప్రజలు. వీడియో వైరల్..

|

Aug 02, 2023 | 8:10 AM

పొలంలో పనులు చేసుకోడానికి వెళ్లిన రైతులు, రైతు కూలీలు అక్కడ కనిపించిన ఓ వింత వస్తువును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ అది యుద్ధ విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడంతో ఎందుకైనా మంచిదని వాయుసేనకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పొలంలో పనులు చేసుకోడానికి వెళ్లిన రైతులు, రైతు కూలీలు అక్కడ కనిపించిన ఓ వింత వస్తువును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ అది యుద్ధ విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడంతో ఎందుకైనా మంచిదని వాయుసేనకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు కంగారు పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న వాయుసేన అధికారులు యుద్ధ విమానానికి చెందిన ఇంధన ట్యాంకుగా గుర్తించారు. యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్ నేలపైకి జారవిడిచారని వైమానిక దళ అధికారులు తెలిపారు. సాధారణ యుద్ధ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విమానం ఆ గ్రామ పరిసరాల్లో పయనిస్తుండగా ఈ సమస్య తలెత్తిందన్నారు. అది జాగ్వార్ యుద్ధ విమానమని అధికారులు పేర్కొన్నారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...