Viral Video: డబ్బై ఏళ్ల వయసులో పండంటి బడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఈ వింత ఘటన ఎక్కడంటే..

|

Aug 18, 2022 | 8:48 AM

పసి పిల్లలు నట్టింట పారాడుతుంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే సంతానం కోసం ప్రతి ఒక్కరూ అంతగా తపిస్తారు. కారణాలేవైనా ఇటీవల సంతాన భాగ్యానికి చాలామంది దూరమవుతున్నారు.


పసి పిల్లలు నట్టింట పారాడుతుంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే సంతానం కోసం ప్రతి ఒక్కరూ అంతగా తపిస్తారు. కారణాలేవైనా ఇటీవల సంతాన భాగ్యానికి చాలామంది దూరమవుతున్నారు. దాంతో సంతానం కోసం వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఓ డబ్బై ఏళ్ల మహిళ సంతానం మీద మక్కువతో ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత ఆ ఇంట బుజ్జాయి కేరింతలతో సందడి నెలకొంది. తమ కలల రూపాన్ని చూసి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. రాజస్థాన్‌కు చెందిన మాజీ సైనికుడైన గోపీచంద్‌కు, చంద్రావతికి 1968లో వివాహమైంది. ఇప్పడు గోపీచంద్‌ వయసు 75 ఏళ్లు, చంద్రావతికి 70 ఏళ్లు. ఇన్నేళ్లయినా వారికి సంతానం కలగలేదు. దాంతో ఏడాదిన్నర క్రితం ఓ ఆసుపత్రిలో ఐవీఎఫ్‌ నిపుణుడైన డాక్టర్‌ పంకజ్‌ గుప్తను సంప్రదించారు. ఐవీఎఫ్‌ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. రెండుసార్లు వారి ప్రయత్నం విఫలమైపోయింది. అయినా వారు కుంగిపోలేదు.. మూడోసారి ప్రయత్నించారు. ఈసారి వారి కల ఫలించింది. చంద్రావతి ఆగస్టు 8న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజస్థాన్‌లో ఏడుపదుల వయసులో ఉన్న తల్లిదండ్రులకు ఐవీఎఫ్‌ విధానంలో సంతానం కలగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on