Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pillalamarri tree: 3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.!

Pillalamarri tree: 3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.!

Anil kumar poka

|

Updated on: Jul 15, 2024 | 10:10 AM

ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కీలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానీకంగా చెప్పవచ్చు. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు దర్శనమిస్తోంది. అయితే పిల్లలమర్రి పునరుజ్జీవంతో పర్యాటకులకు తిరిగి చేరువ కానుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.

ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కీలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానీకంగా చెప్పవచ్చు. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు దర్శనమిస్తోంది. అయితే పిల్లలమర్రి పునరుజ్జీవంతో పర్యాటకులకు తిరిగి చేరువ కానుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. త్వరలోనే సందర్శకుల కోసం పిల్లలమర్రి గేట్లు తేరుచుకోనున్నాయి. నాలుగేళ్ల క్రితం తెగులు, చెదలతో పిల్లలమర్రికి గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని ఆందోళన చెందారు. దీంతో పరిస్థితిని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పిల్లలమర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

అటవీశాఖ పర్యవేక్షణలో అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు. భారీ మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టడంతో అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావాణాన్ని నింపి చికిత్స అందించారు. బలమైన సేంద్రీయఎరువులతో కూడిన మట్టిని నింపారు. మర్రిచెట్టు బలంగా ఉండాలంటే దాని ఊడలు భూమిని తాకాలి… అలా అయితేనే బలంగా నిలబడుతుంది. దీంతో ఊడలకు ఎలాంటి సమస్యలు రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్ ను అందించారు. సుధీర్ఘ కాలం తర్వాత తాత, ముత్తాతల కాలం నాటి చెట్టు మళ్లీ జీవం పోసుకుంది. పచ్చదనంతో కలకలలాడుతూ కొత్త ఊడలతో మహావృక్షం మళ్లీ దర్జాగా నిలబడింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తాజా ప్రకటనతో సంతోషంలో మునిగిపోతున్నారు. పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లలమర్రి గేట్లు తెరుచుకోనున్నాయి. మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల కోసం మౌలికవసతులను అభివృద్ధి చేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటు, పర్యాటకులు సేదతీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్తగా పార్కును, వాల్ పెయింటింగ్స్ సిద్ధం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.