Dog Help: నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న శునకం.. కాళ్లు లేని యజమాని కోసం డ్రైవర్‌గా మారిన పెంపుడు కుక్క..!
శునకాలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం అంటారు.. ఆ మాటలు నిజం చేస్తూ కుక్కలు కూడా ఎప్పటికప్పుడు తమ యజమాని పట్ల విశ్వాసాన్ని చూపుతూనే ఉంటాయి. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవాలు శునకాలు.
దివ్యాంగుడైన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క సాయంతో నగరం చుట్టూ తిరుగుతున్న ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది. దివ్యాంగుడైన తన యజమాని ఆజ్ఞకు విధేయత చూపుతూ, ఈ కుక్క అతడు ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా అతనికి తోడుగా నిలుస్తుంది. యజమాని ఉన్న వీల్‌ఛైర్‌ను నెట్టుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ కుక్క.. దివ్యాంగుడైన తన యజమాని వీల్‌చైర్‌పై కూర్చుని ఉంటే తోసుకుంటూ వెళ్తోంది. సిగ్నల్ దగ్గర, ఏదైనా వాహనం ఎదురైతే యజమాని ఆదేశంతో సైకిల్‌ని ఆపేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Published on: Oct 28, 2022 08:22 AM