Next level driving: డ్రైవింగ్‌లో ఇది నెక్స్ట్ లెవల్.. ఈయన టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంకే.. అది కూడా రివర్స్‌లో..

|

Oct 05, 2022 | 9:58 AM

కొంతమంది రోడ్డుపైన బైక్‌పైన, లేదా కారులో వేగంగా దూసుకుపోతూ రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రైవింగ్‌లో తమను మించినవాళ్లు లేరనుకుంటారు. అలాంటివాళ్లకు ఈ వీడియో ఛాలెంజ్‌ అని చెప్పాలి.

డ్రైవింగ్‌లో ఇది నెక్స్ట్ లెవల్.. ఈయన టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంకే..@TV9 Telugu Digital
కొంతమంది రోడ్డుపైన బైక్‌పైన, లేదా కారులో వేగంగా దూసుకుపోతూ రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రైవింగ్‌లో తమను మించినవాళ్లు లేరనుకుంటారు. అలాంటివాళ్లకు ఈ వీడియో ఛాలెంజ్‌ అని చెప్పాలి. ఇరుకుగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడం అంటే చాలా రిస్క్‌తో కూడుకున్నది. అక్కడ ట్రాఫిక్ లేకపోయినా అసలు డ్రైవింగ్ టెస్ట్ అక్కడే ఉంటుంది. ప్రస్తుతం, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని వ్యక్తి డ్రైవింగ్ ట్యాలెంట్‌ చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.వైరల్ అవుతున్న వీడియోలో, ఓ మైదానం మధ్యలో పెద్ద కాలువ ఉంది. దానిపై రెండు బరువైన కర్రదిమ్మెలు వంతెనలాగా ఉంచారు. వాటిపై కారు నడిపేందుకు సిద్ధమయ్యాడు మనోడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. కారును వెనకకు డ్రైవ్ చేయడం. ఆ సన్నని కర్రలపై కారు నడపడమే డేంజర్‌ అంటే మనోడు రివర్స్‌లో నడుపుతున్నాడు. వీడు కాల్వలో పడటం ఖాయం అనుకుంటారు చూసేవాళ్లు.. కానీ మనోడు తన ట్యాలెంట్‌తో నెటిజన్లకు పిచ్చెక్కించేశాడు. నువ్వు తోపు బాస్‌ … సూపర్‌ అంటూ కామెంట్లతో తెగ పొగిడేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 05, 2022 09:51 AM