Indian railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రైలులో ప్రశాంతంగా నిద్రపోండి..!
రైలులో దూర ప్రయాణం చేసే వారికి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. భారతీయ రైల్వే దేశంలోని సామాన్య ప్రజల జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. నిత్యం లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు.
రైలులో దూర ప్రయాణం చేసే వారికి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. భారతీయ రైల్వే దేశంలోని సామాన్య ప్రజల జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. నిత్యం లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ వారి సౌకర్యాల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త సదుపాయం తీసుకువచ్చింది. నిద్రపోయి లేదా మరిచిపోయి.. దిగాల్సిన స్టేషన్ దాటిపోయే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ తెచ్చింది. ఇందుకోసం 139 నంబర్ కి కాల్ చేసి.. మీ PNR నెంబర్ చెప్పి, దృవీకరించాలి. ఇలా చేస్తే.. మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందు మీకు ఫోన్ వస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంటుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!