Daughter-Father: ‛దృశ్యం’ సినిమా పది సార్లు చూసి.. తండ్రిని హ‌త్య చేసిన కూతురు..! ఎందుకో తెలుసా..?

మనషుల్లో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు, అనుబంధాలు మరిచి రక్తసంబంధీకులనే కడతేరుస్తున్నారు. త‌న ప్రేమ‌కు అడ్డు ప‌డుతున్న తండ్రిని ప్రియుడితో హ‌త్య చేయించింది ఓ కూతురు.

Daughter-Father: ‛దృశ్యం’ సినిమా పది సార్లు చూసి.. తండ్రిని హ‌త్య చేసిన కూతురు..! ఎందుకో తెలుసా..?

|

Updated on: Oct 06, 2022 | 7:55 PM

మనషుల్లో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు, అనుబంధాలు మరిచి రక్తసంబంధీకులనే కడతేరుస్తున్నారు. త‌న ప్రేమ‌కు అడ్డు ప‌డుతున్న తండ్రిని ప్రియుడితో హ‌త్య చేయించింది ఓ కూతురు. ఈ హ‌త్యకు ఆమె త‌ల్లి కూడా స‌హ‌క‌రించింది. దృశ్యం సినిమా ప‌ది సార్లు చూసిన త‌ర్వాత ఈ దారుణానికి పాల్పడిన‌ట్లు నిందితులు తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలో జరిగిన దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. సుధీర్ కాంబ్లే, రోహిణి దంప‌తుల‌కు స్నేహ అనే కుమార్తె ఉంది. కొంతకాలం దుబాయ్‌లో పని చేసి ఇండియాకు తిరిగొచ్చిన సుధీర్ రెండేళ్ళుగా బెళగావిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్నేహ పుణెలో హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు చ‌దువుతోంది. ఈ క్రమంలో ఆమె త‌న క్లాస్‌మేట్ అక్షయ్ విఠ‌క‌ర్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఇటీవ‌ల పుణె నుంచి త‌న ఇంటికి తిరిగొచ్చిన స్నేహ తన ప్రేమ విష‌యం సుధీర్‌కు తెలిసింది. అయితే చ‌దువుపై దృష్టి సారించాల‌ని తండ్రి ఆమెను మంద‌లించాడు. దీంతో తండ్రిపై క‌క్ష పెంచుకున్న స్నేహ.. ఎలాగైనా తండ్రిని చంపాల‌ని త‌ల్లికి, ప్రియుడికి చెప్పింది. ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి దృశ్యం సినిమాను ప‌ది సార్లు చూశారు. స‌మ‌యం కోసం వేచి చూశారు. ఇక, సెప్టెంబ‌ర్ 17వ తేదీన పుణె నుంచి అక్షయ్‌ను బెళ‌గావికి ర‌ప్పించారు. ఇంటి పై అంత‌స్తులో నిద్రిస్తున్న సుధీర్‌ కాళ్లు చేతులను తల్లీకూతుళ్లు ప‌ట్టుకోగా, అక్షయ్ క‌త్తితో విచ‌క్షణార‌హితంగా పొడిచి చంపాడు. ప్రాణాలు కోల్పోయాడ‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత‌, అక్షయ్ పుణె వెళ్లిపోయాడు. పైగా త‌న భర్తను గుర్తు తెలియని వ్యక్తులు చంపార‌ని రోహిణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో తల్లీకూతుళ్లను విచారించ‌గా, చేసిన నేరాన్ని అంగీక‌రించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు