Car Viral: వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్..
బ్రేక్ ఎంత తొక్కినా ఫర్వాలేదు.. యాక్సిలేటర్ ఎక్కువ తొక్కితే మాత్రం ఇలాగే ఉంటుంది. విశాఖలో ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్లాడు.. అసలే డ్రైవింగ్ చేయడం కొత్త.. మెల్లగా పోనిస్తున్నాడు.. వంతెనపై వరకు బాగానే వచ్చాడు.. కట్ చేస్తే ఒక్కసారి కారు మాయమైంది.. శబ్దం వచ్చింది.. వంతెన పైనుంచి కిందకు తొంగి చూస్తే.. ఇంకేముంది కాలువలో కారు కనిపించింది..
వడ్లపూడి హైవేపై ఘటన జరిగింది.. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లోని సెక్టర్ 6 లో నివాసం ఉంటున్న సూర్యారావు కారుపై మోజు పెంచుకున్నాడు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకుండానే.. కారెక్కాడు.. మెల్లగా పోనిస్తూ డ్రైవింగ్ లో మెలకువలు మెల్లగా నేర్చుకుంటున్నాడు.. కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు కారులో వెళుతున్నాడు. అంతలోనే.. కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పై వెళ్తున్న కారు.. కాలవలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు సూర్యారావు గాయాలు కాకుండానే బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.. ఆరా తీస్తే.. ఎవరో ఓ వ్యక్తి కారుకు అడ్డుగా రావడంతో బ్రేక్ వేయబోయి.. యాక్సిలేటర్ నొక్కేసాడు సూర్యరావు. దీంతో ఆగాల్సిన కారు అదుపుతప్పి దూసుకుపోయినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.