Selfie Video: వావ్..! పక్క పక్కనే వెళ్తున్న రెండు రైళ్లు.. మధ్యలో సెల్ఫీ దిగుతూ తండ్రీ కొడుకులు..

Updated on: Jun 22, 2022 | 9:56 AM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎన్నో అద్భుతాలను మనం చూస్తున్నాం. నెట్టింట రకరకా వీడియోలు, ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విజ్ఞానంతో పాటు ఎన్నో అనుభూతులను పంచుతున్నాయి.


సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎన్నో అద్భుతాలను మనం చూస్తున్నాం. నెట్టింట రకరకా వీడియోలు, ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విజ్ఞానంతో పాటు ఎన్నో అనుభూతులను పంచుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పక్కనే ఉన్న పట్టాలపైన రెండు రైళ్లు వేగంగా వెళ్తున్నాయి. ఆ ట్రైన్‌ లోనుంచి ఒకరు, ఈ ట్రైన్‌లో నుంచి ఇంకొకరు ఒకరినొకరు సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ అద్భుతమైన ఫోటో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే..ఇంతకీ ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులూ తండ్రీ కొడుకులు. ఇద్దరూ రైల్వేలో పనిచేస్తున్నారు. తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుంటే.. కుమారుడు టీసీగా పనిచేస్తున్నాడు. ఓ రోజు వారిద్దరూ విధుల్లో ఉండగా ఊహించని సంఘటన జరిగింది. ఇద్దరు ప్రయాణిస్తున్న రైళ్లు రెండూ పక్కపక్కనే పట్టాలపైనే పయనిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రైళ్లు ఓ ప్రదేశంలో ఆగాయి. ఇవతల రైల్లోంచి కొడుకు, అవతల రైల్లోంచి తండ్రితో తన మొబైల్‌ ఫోన్‌లో సెల్పీ తీసుకున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ ఫోటోను సురేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘అద్భుతమైన సెల్ఫీ’ అని దానికి శీర్షిక పెట్టాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది, తండ్రీ, కుమారుల పేర్లను ఆయన తెలపలేదు. మరోవైపు, తండ్రీ కొడుకుల సెల్ఫీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ అద్భుత సెల్ఫీపై నెటిజన్లు కూడా అద్భుతంగా స్పందించారు. టైమింగ్‌ అంటే ఇది అని ఒకరు అంటే, బెస్ట్‌ సెల్ఫీ, ఈ యుగపు సెల్ఫీ అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..