Viral Video: రెండో భార్య కావాలంటూ బ్యానర్లు పెట్టించాడు.. చర్చకు దారి తీసిన వార్త..(వీడియో)
ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరి కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. రమేశ్ పాటిల్ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరి కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. రమేశ్ పాటిల్ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేశ్ ఓ ఉపాయం ఆలోచించాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో దింపాలనుకున్నాడు. అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదని రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు. తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా ఔరంగాబాద్ మొత్తం బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో బ్యానర్‌లో స్పష్టం చేశాడు. పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు కూడా విధించాడు. తన ఫోన్ నంబర్ అచ్చు వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు.