Viral: హృదయవిదాకర ఘటన.! కవరులో బిడ్డ మృతదేహంతో బైక్‌పైనే 70 కి.మీ. పయనం.!

|

Sep 01, 2023 | 9:37 PM

ఛత్తీస్‌గఢ్‌లో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోర్బా జిల్లాలో ఓ తండ్రి ఏడాదిన్నర బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం 70 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లాడు. స్థానిక ఆసుపత్రి సిబ్బంది అంబులెన్సు సమకూర్చకపోవడంతో.. చేసీదీ లేక సొంత బైక్‌పై డెడ్ బాడీ తరలించారు. వికాస్‌ఖండ్‌ మండలంలోని అడ్‌సేనా గ్రామంలో రామ్‌యాదవ్‌ దంపతులు నివసిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోర్బా జిల్లాలో ఓ తండ్రి ఏడాదిన్నర బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం 70 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లాడు. స్థానిక ఆసుపత్రి సిబ్బంది అంబులెన్సు సమకూర్చకపోవడంతో.. చేసీదీ లేక సొంత బైక్‌పై డెడ్ బాడీ తరలించారు. వికాస్‌ఖండ్‌ మండలంలోని అడ్‌సేనా గ్రామంలో రామ్‌యాదవ్‌ దంపతులు నివసిస్తున్నారు. రామ్‌యాదవ్‌ భార్య కుమారుణ్ని పొలానికి తీసుకువెళ్లింది. ఆమె పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాలుడు ఆడుకొంటూ ప్రమాదవశాత్తు సమీప చెరువులో మునిగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకుతీసి.. హూటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు.. పోస్టుమార్టం తప్పనిసరని చెప్పారు. దీనికి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తమ వద్ద అంబులెన్సు లేదని, సొంత ఏర్పాట్లు చేసుకొని వెళ్లాలని వైద్య సిబ్బంది చెప్పడంతో.. పుట్టెడు దుఃఖంలోనే రామ్‌యాదవ్‌ కుమారుడి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవరులో చుట్టి స్నేహితుడి సహాయంతో బైక్‌పై జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీహెచ్‌సీ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..