Love Couple Suicide: తెల్లారేసరికల్లా విగతజీవులుగా మారిన ప్రేమజంట.! అసలు ఎం జరిగిందంటే..

Updated on: Oct 26, 2022 | 9:44 AM

విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జైలు రోడ్ వద్ద గొల్లపాలెంలోని ఓ హోటల్లో ఓ యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండల కేంద్రానికి చెందిన దామోదర్, లావేరుకు చెందిన


విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జైలు రోడ్ వద్ద గొల్లపాలెంలోని ఓ హోటల్లో ఓ యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండల కేంద్రానికి చెందిన దామోదర్, లావేరుకు చెందిన సంతోషిగా పోలీసులు గుర్తించారు. ముందురోజు మధ్యాహ్నం హోటల్లో చెక్ ఇన్ అయిన ఈ ప్రేమికులు తెల్లారేసరికల్లా విగతజీవులుగా మారారు. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించ్చారు.దామోదర్ వయసు 19 సంవత్సరాలు. డిగ్రీ సెకండియర్ చదువుతూ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సంతోషి వయసు 18 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినా కానీ పెద్దలు కాదనడంతో సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి అక్కడ ఓ లాడ్జ్‌లో రూమ్ తీసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..

Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..

Published on: Oct 26, 2022 09:44 AM