Baby monkey: తల్లి మృతితో తల్లడిల్లిన బుల్లి వానరం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో.
అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మ లేని జీవితం శూన్యమే. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా. జంతువైనా, మనిషైనా తల్లి ప్రేమలో తేడా ఉండదు.
అసోలోని రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వెళ్తున్న వాహనం ఒకటి ఓ వానరాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే ఆ కోతి ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో దాని ఒడిలో తన పిల్ల వానరం కూడాఉంది. ఆ చిన్ని వానరం తన తల్లి ఎందుకు అలా రోడ్డుపై చలనం లేకుండా పడి ఉందో తెలియక… తల్లిని లేపే ప్రయత్నం చేసింది. అయినా తల్లి లేవకపోవడంతో ఆ బుల్లి వానరం తల్లడిల్లిపోయింది. అసలు తన తల్లికి ఏమైందో కూడా తెలియని ఆ చిన్ని ప్రాణి మూగగా రోధించింది. చనిపోయిన తల్లిని చుట్టుకుని బుల్లి వానరం ఏడుస్తున్న వీడియో అందరి హృదయాలను మెలిపెడుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను సైతం కదిలించింది. అసలు తల్లి అలా ఎందుకు పడిఉందో తెలియక బుల్లి వానరం తల్లడిల్లుతోంది..ఆ చిన్ని వానరాన్ని సంరక్షించేందుకు అన్ని చర్యలూ చేపడతామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇది చాలా విషాదకర ఘటన అని ఓ యూజర్ కామెంట్ చేయగా, హృదయాన్ని కలిచివేసే ఉదంతమని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎవరైనా డ్రైవింగ్ చేయాలని మరొకరు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
