Leopard: బావిలో చిరుత.. హరప్పా టెక్నాలజీతో రెస్క్యూ.! వైరల్‌గా మారిన వీడియో

|

Jul 01, 2022 | 8:56 AM

బావిలో పడిన చిరుతపులిని హరప్పా మొహంజోదారో కాలం నాటి పురాతన సాంకేతికతను ఉపయోగించి అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి


బావిలో పడిన చిరుతపులిని హరప్పా మొహంజోదారో కాలం నాటి పురాతన సాంకేతికతను ఉపయోగించి అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అటవీ శాఖ సిబ్బంది మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించారు. చిరుత ఆ మంచంపైకి చేరగానే తాళ్ల సహాయంతో పైకి లాగారు. దీంతో మంచంపై ఉన్న ఆ చిరుత బావి గట్టుపైకి దూకి అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లిపోయింది. ‘జంతువుల ఆవాసాల చుట్టూ ఉన్న బహిరంగ బావులను మూసివేసినప్పుడే ఇలాంటివి ఆగుతాయి’ అని సుశాంత నంద ట్వీట్ లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పటికే సుమారు 50 వేల మందికి పైగా దీనిని చూశారు. ఓపెన్‌ బావులపై జల్లెడ వంటి మూతలు అమర్చితే జంతువులతోపాటు మనుషులకు కూడా ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయని కొందరు నెటిజన్లు సూచించారు. దీనిని మిషన్‌ మోడ్‌లో చేపట్టాలన్నారు. అటవీశాఖ దీనికి చొరవ చూపాలని, పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి ఓపెన్‌ బావులకు పైమూతలు అమర్చడంపై దృష్టి సారించాలని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Follow us on