Madhya Pradesh : ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ పాము కాటుతో భార్యను హతమార్చాలని చూసాడు..
మొదటి భార్యతో కలిసుండటానికి ఓ వ్యక్తి రెండో భార్య అడ్డు తొలగించాలని ప్లాన్ వేశాడు. పాముతో కరిపించి, విషం ఎక్కించి చంపేయాలని చూసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మేరీ స్మగ్లింగ్ కేసులో జైలు పాలయ్యాడు. అతని భార్య షాను బీ తన ప్రియుడితో కలిసి పరారయ్యింది. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత ఇంటికి వచ్చిన మోజిమ్ 2015లో హలీమా బీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసి మొదటి భార్య తిరిగి ఇంటికి వస్తానని పట్టుబట్టింది. దీంతో అతను షాను బీతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రెండో భార్య ససేమిరా అంటుందని ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. మోజిమ్ స్నేక్ క్యాచర్ అయిన తన స్నేహితుడు రమేష్ మీనాతో కలిసి ఓ విషపూరిత పామును ఇంటికి తీసుకెళ్లి రెండో భార్యకు కాటు వేయించాడు. కొంతసేపటికి మూర్ఛపోయిన హలీమా మళ్లీ స్పృహలోకి వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలనుకున్న మోజిమ్.. అతని సోదరుడు కాలా సాయంతో శుక్రవారం ఉదయం హలీమాను మళ్లీ పట్టుకుని రమేష్‌తో ఆమెపైకి పామును వదిలించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెకు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇచ్చి పరారయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హలీమాను ఆమె తండ్రి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త మోజిమ్, అతని సోదరుడు, తల్లి, స్నేహితుణ్ని అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

