Marriage Fight: స్టేజీపైనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధువరులు..! పాపం భార్యకు స్వీట్ తినిపించడం తప్పా…
పెళ్లంటే నూరేళ్ల పంట.. వివాహం ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరిగే అపురూపమైన వేడుక. అందుకే తమ పెళ్లిని పది మంది పది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని వధూవరులు కలలుకంటుంటారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుంటారు.
కొన్ని పెళ్లిళ్లు హంగూ ఆర్భాటాలతో ఫేమస్ అయితే.. మరికొన్ని మాత్రం గొడవలతో వైరల్ అవుతుంటాయి. భోజనం పెట్టలేదనో, చికెన్, మటన్ వడ్డించలేదనో, వరుడికి తగినంత కట్నం ఇవ్వలేదనో.. ఇలా కారణాలు ఎన్నైనా.. ఆఖరికి దారి తీసేదీ గొడవకే. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి రిసెప్షన్ సందర్భంగా వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. జయమాల ధారణ చేసుకునే సమయంలో ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటారు. అయితే వరుడు వధువు నోట్లో స్వీట్ పెట్టగానే ఆమె చాలు అంటూ సైగ చేసింది. అయినా వరుడు ఆగకుండా బలవంతంగా తినిపించేందుకు ట్రై చేశాడు. వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది. ముందు వెనకా చూడకుండా ఎడపెడా వాయించేసింది. ఇక వరుడు ఊరుకుంటాడా.. అతను కూడా ఇష్టమొచ్చినట్లు వధువును కొట్టాడు. ఊహించని ఈ ఘటనకు మండపంలో ఉన్న బంధుమిత్రులంతా షాకయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యి.. వారిని కంట్రోల్ చేశారు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

