Viral video: లారీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్లు.. డ్రైవర్ ఎం చేసాడో తెలుసా..
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి.
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు.కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు వంద సిలిండర్లు పేలినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 06, 2022 09:52 AM
వైరల్ వీడియోలు
Latest Videos