Viral Video: వామ్మో.. వేగంగా దూసుకుపోతున్న బస్సుపై కులిన భారీ వృక్షం.. షాకింగ్ దృశ్యాలు

|

Feb 22, 2022 | 9:21 AM

Viral Video: యూకేపై యూనిస్‌ తుఫాన్‌ విరుచుకుపడుతోంది. ఈదురు గాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు ఏకంగా 100 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు జనం చిన్నాభిన్నమవుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఇక గాలుల ధాటికి విమానాలు సైతం గాలి..

Viral Video: వామ్మో.. వేగంగా దూసుకుపోతున్న బస్సుపై కులిన భారీ వృక్షం.. షాకింగ్ దృశ్యాలు
Viral Video
Follow us on

Viral Video: యూకేపై యూనిస్‌ తుఫాన్‌ విరుచుకుపడుతోంది. ఈదురు గాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు ఏకంగా 100 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు జనం చిన్నాభిన్నమవుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఇక గాలుల ధాటికి విమానాలు సైతం గాలి పటాల్లా ఊగిపోతున్నాయి. ఈ తుఫాన్‌ కారణంగా 436 విమానాల సర్వీసులను అధికారులు తాత్కలికంగా రద్దు చేశారు. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుంచి యూరప్ వైపు దూసుకెళ్లిన ఈ తుఫాన్‌ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉంటే యూనిస్‌ తుఫాన్‌ సృష్టిస్తోన్న బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియో వీక్షకులను షాకింగ్‌కు గురి చేస్తోంది. తఫాన్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోందా ఆ వీడియో. వివరాల్లోకి వెళితే యూకేలోని వీధుల్లో ఓ బస్సు వేగంగా దూసుకొస్తుంది. ఆ సమయంలో గాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఓ పెద్ద వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. అదే సమయంలో అటు నుంచి వెళుతోన్న బస్సు ముందు భాగంలో వృక్షం పడింది.

దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే చెట్టు బస్సు ముందు భాగంలో పడడంతో పెద్దగా నష్టం జరిగినట్లు కనిపించడం లేదు. అదే ఒకవేళ మధ్యలో పడితే మాత్రం ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. ఇదంతా ఎదరుగా వస్తున్న మరో వాహనంలో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే క్షణాల్లో వైరల్‌గా మారింది. మరి ఈ షాకింగ్‌ వీడియోను మీరూ చూడండి..

Also Read: Goutham Reddy: నెల్లూరుకు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవదేహం.. రేపు ఉదయగిరిలో అంత్యక్రియలు

Kajal Aggarwal: వేడుకగా కాజల్‌ సీమంతం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Sri Lanka: బ్రిటన్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన శ్రీలంక.. కొలంబో పోర్టు నుంచి కార్గో షిప్‌‌లను వెనక్కు.. ఎందుకో తెలుసా?