Loading video

ఆ గ్రామంలో.. ఆకాశం నుంచి పడిన భారీ యంత్రం.. చివరకు..

|

Jan 23, 2025 | 2:22 PM

ఉన్నట్టుండి ఆ గ్రామంలో అలజడి రేగింది. ఆకాశం నుంచి ఓ యంత్రం ఊడి అమాంతం ఆ గ్రామంలో పడింది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామవాసుల ఉలిక్కిపడ్డారు. భయాందోళన చెందారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని జల్సంగి గ్రామంలోనిదీ సీన్‌. జనవరి 18 శనివారం రోజున జల్సిగి గ్రామ వాసులకు ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద యంత్రం పడింది. ఆ యంత్రానికి ఓ పెద్ద బెలూన్‌ కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

దీనికి తోడు బెలూన్‌కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్‌ లైట్‌ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తుల భయం రెట్టింపయింది. బెలూన్‌తో కూడిన భారీ యంత్రం ఆకాశం నుంచి తమ ఇళ్ల మీద ఊడి పడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్‌ తాలూకా పోలీసులు స్పాట్‌కు చేరుకుని బెలూన్‌ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్‌ యంత్రం టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌కు చెందినదని పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో టీఐఎఫ్‌ఆర్‌ కేంద్రం నుంచి ఆకాశంలోకి బెలూన్‌ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటారు. హొమ్నాబాద్‌ పోలీసులు బెలూన్‌ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్‌ఆర్‌ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్‌ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.