Elephants video: కారుపై ఏనుగుల గుంపు దాడి… సీన్‌ కట్‌ చేస్తే.. కాసేపటికే షాకింగ్‌ సీన్‌.!

|

Jul 01, 2022 | 10:08 AM

ఇటీవలి కాలంలో ఏనుగులు అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నాయి.


ఇటీవలి కాలంలో ఏనుగులు అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రజలను చంపేస్తున్నాయి కూడా. ఇకపోతే తాజాగా ఓ ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఘాట్‌ రోడ్డులో నానా రచ్చ చేశాయి. కర్నాటకలోని హసనూర్‌ ప్రాంతంలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగులు.. ఓ కారును అడ్డగించి ధ్వంసం చేశాయి. తొలత ఏనుగుల గుంపు రోడ్డు మీద రావడంతో చాలా వాహనాలు అలాగే ఓ ఆర్టీసీ బస్సు ఆగిపోయాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన కారును రయ్‌ అంటూ ఏనుగులను దాటుకోని వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఏనుగులు.. ఆ కారును అడ్డగించి, కారు బ్యానెట్‌పై తొండంతో దాడి చేశాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన కారులోని ఓ ప్రయాణికుడు కారు దిగి ఏనుగుల నుంచి దూరంగా పరిగెత్తాడు. ఇక ఆ కాసేపటికే ఆ ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jul 01, 2022 10:08 AM