Viral Video: పెళ్లికి పిలిచి అవమానించాడంటూ వరుడిపై కేసు.. రూ.50 లక్షలకు దావా..
వివాహ వేడుక అంటేనే బంధువులు, స్నేహితులతో ఎంతో సందడిగా సాగే కార్యక్రమం. అందుకే వివాహాన్ని చాలామంది ఎంతో స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఓ వరుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు.
వివాహ వేడుక అంటేనే బంధువులు, స్నేహితులతో ఎంతో సందడిగా సాగే కార్యక్రమం. అందుకే వివాహాన్ని చాలామంది ఎంతో స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఓ వరుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి స్నేహితుడు. తీరా ఫ్రెండ్స్ వచ్చేసరికి వరుడు పెళ్లి మండపానికి వెళ్లిపోయాడు. దాంతో ఆగ్రహించిన మిత్రులు అతనిపై కేసుపెట్టారు.. ఈ విచిత్ర సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. హరిద్వార్‌లోని బహదూరాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా వివాహానికి బయలుదేరుతున్నామని, స్నేహితులందరూ తప్పక బారాత్‌లో పాల్గొనాలని అతని స్నేహితుడిద్వారా అందరికీ ఇన్విటేషన్లు పంపాడు. అలాగే ఆ సమయానికి అందరం కలుసుకుందామని స్నేహితులకు చెప్పాడు. కాగా, పెళ్లి రోజున స్నేహితులందరు అనుకున్న సమయానికి వరుడు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు. ఇది తెలిసిన స్నేహితులు పట్టరాని ఆగ్రహంతో వరుడికి ఫోన్ చేశారు. అయితే వారు రావడం ఆలస్యమైందని, అందుకే వెళ్లిపోయామని పెళ్లి కుమారుడు ఆరోపించాడు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు.దీంతో వరుడి తీరుపై స్నేహితుడు మండిపడ్డాడు. వెంటనే న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు తమ గౌరవాన్ని దెబ్బతీసినందుకు వరుడిపై 50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. పెళ్లికి ఆహ్వానించిన స్నేహితులు, అతిథులతోపాటు దానికి పురమాయించిన తనను మానసికంగా హింసించినట్లు అందులో ఆరోపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

