Gold Well: బావిలో బంగారం.! అర్ధరాత్రి వింత శబ్దాలు.. తవ్వకాలు జరుపుతున్న ముఠా..

|

Sep 20, 2023 | 4:27 PM

ఇది అత్యంత పురాతన బావి. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి పురాతన బావిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి బావులు చూడటం చాలా అరుదు. అయితే.. ఈ బావి లో భారీగా బంగారు సంపద ఉందని చరిత్ర ఆనవాళ్లు ద్వారా తెలుస్తోంది. దీంతో అక్కడ నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. కరీంనగర్ సమీపంలో ఎలగందుల అనే పురాతన గ్రామం ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఖిల్లాకు 500 మీటర్ల దూరంలో నాగయ్య బావి ఉంది.

ఇది అత్యంత పురాతన బావి. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి పురాతన బావిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి బావులు చూడటం చాలా అరుదు. అయితే.. ఈ బావి లో భారీగా బంగారు సంపద ఉందని చరిత్ర ఆనవాళ్లు ద్వారా తెలుస్తోంది. దీంతో అక్కడ నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. కరీంనగర్ సమీపంలో ఎలగందుల అనే పురాతన గ్రామం ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఖిల్లాకు 500 మీటర్ల దూరంలో నాగయ్య బావి ఉంది. ఈ బావి కి సమిపంలో నాగదేవాలయం ఉంటుంది. అందుకే దీనిని నాగయ్య బావిగా పిలుస్తున్నారు స్థానికులు. కాకతీయులు కాలంలో పూర్తిగా రాయితో నిర్మించిన బావి ఇది. ఇప్పటికీ ఈ కట్టడాలు చెక్కు చెదురలేదు. అప్పట్లో రాజులు, రాణులు ఈ బావి లో స్నానం ఆచరించేవారట. ఈ బావి పక్కన రెండు పురాతన గదులు ఉన్నాయి. కాకతీయులు సంపదను కూడా ఈ బావి పక్కనే దాచి పెట్టారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీనిని బంగారు బావి అని కూడా పిలుస్తారు. ఈ బావి లో ఎప్పటికీ నీరు ఉంటుంది. వేసవి కాలంలో తక్కువ నీరు ఉన్న సమయంలో తవ్వకాలు చేస్తున్నారు. బావి పక్కన ఉన్న గదుల్లో తవ్వకాలు చేపట్టగా.. బంగారం కూడా దొరికిందనే ప్రచారమూ సాగింది. ఈ ప్రాంతంలో గుప్త నిధుల ముఠా సంచరిస్తోందని, . గతంలో మేకతో పాటు, ఇతర జంతువులను కూడా ఈ బావి సమీపంలో బలి ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. పసుపు, కుంకుమతో పాటు క్షుద్రపూజలకు సంబంధించిన పూజ సామాగ్రీ కూడా ఉండటతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు బంగారు నాణేలు కొట్టుకు వస్తున్నాయని, దాంతో గుప్త నిధుల ముఠా తవ్వకాలు చేస్తున్నారని, గతంలో అమావాస్య రోజున తవ్వకాలు చేయగా భారీగా బంగారం లభించిందనే ప్రచారం జరిగింది. ఈ బావిని చూటడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. బావికి సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..