Viral Video: దొంగను చూసి భయపడిన ప్రియుడు..నడిరోడ్డుపై ప్రియురాలిని వదిలి పరార్.
నీ కోసం ప్రాణమిస్తా.. నువ్వు లేక పోతే నేను లేను అంటూ కబుర్లు చెప్పాడు. అమ్మాయిని ప్రేమలో దింపాడు. చెట్టాపట్టాలేసుకుని షికారుకు బయలుదేరాడు. అంతే చిన్న ఆపద రాగానే అమ్మాయిని నడిరోడ్డుమీద వదిలి పారిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రేమజంట చేతిలో చేయి వేసుకొని.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. ఇంతలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు ప్రియురాలిని బ్యాగ్ ఇవ్వాలంటూ కత్తితో బెదిరించారు. అది చూసిన ప్రియుడు ప్రియురాలిని అక్కడే వదిలేసి వెనక్కి తిరిగిచూడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. షాక్ అయిన ఆ అమ్మాయి.. తన దగ్గర ఉన్న బ్యాగును ఆ దొంగలకు ఇచ్చేసింది. వేరే దారి లేక, తప్పించుకోలేక.. ప్రియుడు పారిపోయిన వైపే చూస్తూ నిలుచుండి పోయింది. పాపం.. ఆ ప్రియురాలి పరిస్థితి చూసిన దొంగకి మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయిని అతను వదిలేసి వెళ్లడం బాధ కలిగించింది. వెంటనే.. ఆమె దగ్గర కొట్టేసిన బ్యాగును.. తిరిగి ఆమెకే ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా..దీనిమీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దొంగ బ్యాగును కొట్టేయడం కంటే ప్రియుడు తనను ఆపదలో వదిలి పారిపోవడమే ఆమెను ఎక్కువగా బాధించిందని ఒకరు కామెంట్ చేశారు. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే తన శక్తికి మించి కాపాడాల్సింది పోయి తన దారి తాను చూసుకున్నాడని.. ధైర్యంలేని ఆ ప్రియుడి కంటే.. మనసున్న ఆ దొంగే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

