Viral Video: కూతురికి అంత్యక్రియలు చేసిన తండ్రి.. అంతలోనే ఆమె వీడియో కాల్.!
బీహార్లో ఓ వింత ఘటన జరిగింది. తన కూతురికి బరువెక్కిన హృదయంతో అంత్యక్రియలు నిర్వహించిన ఓ తండ్రికి ఇంటికి రాగానే అనుకోని షాక్ ఎదురయ్యింది. చనిపోయింది అని అనుకున్నకూతురు కాస్తా వీడియో కాల్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘నాన్నా నేను బతికే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను’ అని తన క్షేమ సమాచారం చెప్పడంతో వీడియో కాల్‌లో కూతురి ముఖం చూసి ఆ తండ్రి కళ్లలో ఆనందం ఉప్పొంగింది.
బీహార్లో ఓ వింత ఘటన జరిగింది. తన కూతురికి బరువెక్కిన హృదయంతో అంత్యక్రియలు నిర్వహించిన ఓ తండ్రికి ఇంటికి రాగానే అనుకోని షాక్ ఎదురయ్యింది. చనిపోయింది అని అనుకున్నకూతురు కాస్తా వీడియో కాల్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘నాన్నా నేను బతికే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను’ అని తన క్షేమ సమాచారం చెప్పడంతో వీడియో కాల్‌లో కూతురి ముఖం చూసి ఆ తండ్రి కళ్లలో ఆనందం ఉప్పొంగింది. ఈ విచిత్రమైన సంఘటన పూర్నియా జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉంటున్న అనూషా కుమారి గత నెల రోజులుగా కనిపించకుండా పోయింది. దీంతో కూతురు కనిపించడం లేదంటూ యువతి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ఇచ్చారు. యువతి కుటుంబ సభ్యులు అనేక చోట్ల అన్వేషించారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో తాజాగా పూర్ణియాలోని ఓ కాలువలో ఓ యువతి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహానికి అనూష మిస్ అయిన సమయంలో వేసుకున్న బట్టలులాగే పోలి ఉన్న బట్టలు ఉన్నాయి. అయితే ముఖం మాత్రం నుజ్జునుజ్జయింది. దీంతో పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కాలువలో లభించిన డెడ్ బాడీ అనూషదని ఆమె తల్లిదండ్రులు అంగీకరించి ఆ డెడ్ బాడీకీ అంత్యక్రియలు నిర్వహించారు. తప్పిపోయిన అనూష చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్త కాస్త అనూష వరకు చేరుకుంది. ఆందోళన చెందిన అనూష వెంటనే తన తండ్రికి వీడియో కాల్ చేసింది. దీంతో ఒక్కసారిగా అనూష కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

