Food delivery: పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా..! ప్రముఖ ఫుడ్‌బాల్ ప్లేయర్ కుటుంబ పోషణ కోసం..వీడియో.
ప్రముఖ క్రీడాకారులు ఎందరో కుటుంబ పోషణకోసం తమ ఆశయాన్ని పక్కన పెట్టి చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటి అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఎందరో
తాజాగా బెంగాల్‌కు చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ పౌలోమి అధికారి ఒకప్పుడు భారత్ తరపున అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. ఇప్పుడు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. పౌలోమి ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో పౌలోమి జొమాటో టీ షర్ట్ ధరించి ఫుడ్ డెలివరీ చేస్తూ కనిపించారు.ఈ వీడియోలో ఆమె ప్రస్తుత తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. కోల్‌కతాలోని బెహలా ప్రాంతానికి చెందిన పౌలోమి ప్రస్తుతం చరుచంద్ర కాలేజ్‌లో చదువుతున్నారు. అండర్ 16 ఫుట్‌బాల్ టోర్నీల్లో భారత్ తరపున పాల్గొంటూ తాను జర్మనీ, బ్రిటన్, శ్రీలంక సహా పలు దేశాల్లో పర్యటించానని ఆమె చెప్పుకొచ్చారు. ఆపై తన కలలను నెరవేర్చుకోలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా మారినట్టు తెలిపారు. తాను రోజంతా కష్టపడితే ఖర్చులు పోను కేవలం 300 నుంచి 400 రూపాయలు మిగులుతాయని ఆమె చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..