అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు..

Edited By:

Updated on: Jan 18, 2026 | 12:47 PM

గోదారోళ్లలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా కొత్త అల్లుడికి చేసే మర్యాదలే వేరు. ఇష్టమైన భోజనం వసంత అయిన విందుతో.. రకరకాల వంటకాలు పెట్టి వడ్డించడం ఆనవాయితీ. ఏమీ లోటు రాకుండా చక్కగా అల్లుడికి చూసుకుంటారు. వాళ్లు గోదావరి జిల్లాలో ఉన్న ఇతర జిల్లాల్లో స్థిరపడినా ఆ అతిథి మర్యాదలు ఏమాత్రం తక్కువగా. తాజాగా ఓ ఫ్యామిలీ అనకాపల్లి జిల్లాలో అల్లుడికి సంక్రాంతికి చేసిన మర్యాదలు అందరినీ ఔరా అనిపించాయి. అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి దక్కిన ప్రేమ గౌరవంతో కూడిన విందు ఆ అల్లుడికి ఆశ్చర్యానికి గురి చేసింది.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అదిరేటి ఆతిథ్యం ఇచ్చింది అత్తింటి కుటుంబం. 29 ఏళ్ల వయసు ఉన్న అల్లుడికి.. సరైన ట్రీట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా.. 290 రకాల వంటకాలు, స్వీట్స్ తో భోజనం వడ్డించారు. వాటిలో పది రకాల బిర్యానీలు, 40 రకాల కూరలు, 140 రకాల మిఠాయిలు, ఇతర తిను బండారాలు పెట్టారు. 29 ఏళ్ల వయసుగల అల్లుడికి మరో సున్నా జోడించి అన్ని రకాల వెరైటీలతో భోజనం వడ్డించారు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన రమేష్, కళావతి సాయి లక్ష్మి 30 ఏళ్ల క్రితం నర్సీపట్నం వలస వచ్చారు. గత ఏడాది జూలైలో కూతురు నవ్యకు నర్సీపట్నం కి చెందిన శ్రీహర్షతో వివాహం చేశారు. తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి గౌరవంతో కూడిన విందు ఇచ్చారు. అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి ఇచ్చిన విందుతో ఆ అల్లుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!