Watch: తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్..

|

Nov 30, 2024 | 8:52 PM

సక్కెస్‌ అనేది ఏ ఒక్కరి సొత్తూకాదు. సరైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దానికోసం సరైన ప్రణాళికతో కష్టపడితే అసాధ్యమనేది ఏదీ ఉండదు. అందుకు ఉదాహరణే ఈ యువతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన యువతి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఏళ్లతరబడి ఇంటికి, తల్లిదండ్రులకు దూరమై చివరికి ఉద్యోగం సాధించలేక కొందరు నిరాశకు గురవుతున్నవారికి స్పూర్తిగా నిలుస్తూ ఎలాంటి కోచింగ్‌ లేకుండా ఇంటివద్దే ఉండి చదువుకుంటూ ఒకటి కాదు 3 ఉద్యోగాలు సాధించడం నిజంగా గర్వించదగ్గవిషయం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన భోగి సమ్మక్క దమ్మపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది. అనంతరం అశ్వరావుపేట పట్టణంలోని వీకేడివిఎస్ రాజు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ లో ఫ్రీ సీట్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఎ ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేసింది. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న సమ్మక్క ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడింది. గత ఏడాది అక్టోబర్లో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో మొదటి ప్రయత్నంలోనే ఓపెన్ క్యాటగిరి లోనే సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించింది సమ్మక్క. అయితే తన లక్ష్యం ఐఏఎస్ కావడంతో కానిస్టేబుల్ గా వెళ్లేందుకు ఇష్టపడలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటి వద్దనే ఉంటూ ఈనెల 14న విడుదల చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాలలో తండ్రి పనిచేస్తున్న జిసిసి గిరిజన సహకార సంస్థలోని జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

అక్కడితో కూడా సంతృప్తి చెందని సమ్మక్క ఈనెల 21న విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలలో సైతం తన ప్రతిభ కనబరిచి ఇంగ్లీష్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా విజయం సాధించింది. ఇలా వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సమ్మక్క తాను ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా స్వయంకృషితో ఈ ఉద్యోగం సాధించినట్టు చెప్పింది. భవిష్యత్తులో తాను ఐఏఎస్ గా ఎదిగి, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు సేవ చేయటమే తన ముందున్న లక్ష్యమని,తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటానని తన అభిప్రాయం వెల్లడించింది. ఉద్యోగం కోసం కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగనక్కర్లేదని, పట్టుదలగా, ప్రణాళిక బద్దంగా ప్రయత్నిస్తే ఇంటినుంచే చదువుకొని లక్ష్యాలు సాధించవచ్చని చెబుతోంది సమ్మక్క.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.